: సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లోకేష్!


కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో నారా లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. కొద్దిసేపటి క్రితం సభా ప్రాంగణానికి లోకేష్ చేరుకోగా, ఆయన్ను అభినందించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు పోటీపడ్డారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు హరికృష్ణ, బాలకృష్ణలతో పాటు కల్యాణ్ రామ్ కూడా వచ్చారు. కుమారుడు దేవాన్ష్ తో సహా బ్రాహ్మణి వచ్చి భువనేశ్వరి పక్కనే కూర్చున్నారు. నూతనంగా మంత్రులుగా బాధ్యతలు స్వీకరించబోయే ఎమ్మెల్యేల కుటుంబాలు ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసుకుని రాగా, వారందరి హడావుడితో వెలగపూడి కళకళలాడుతోంది. మరికాసేపట్లో గవర్నర్ నరసింహన్ వేదిక వద్దకు చేరుకోగానే, అధికారిక కార్యక్రమం మొదలవుతుంది.

  • Loading...

More Telugu News