: అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం యోచన


అత్యాచారానికి పాల్పడే వారికి ఉరిశిక్ష విధించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే శీతాకాల సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. బిల్లు ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తెలిపారు. బాలికల వసతి గృహాల వద్ద పోలీసుల నిఘా పెంచుతామని, వారి పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. రోమియోల భరతం పట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా యాంటీ రోమియో స్క్వాడ్‌ను ఏర్పాటు చేసి ఆకతాయిల భరతం పడుతుండగా పలు రాష్ట్రాలు కూడా యూపీని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగానే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News