: సీఆర్‌పీఎఫ్ క్యాంపులో ఫుడ్ పాయిజన్.. 400 మంది జవాన్లకు అస్వస్థత
ఫుడ్ పాయిజన్ కారణంగా 400 మంది జవాన్లు అస్వస్థతకు గురైన ఘటన కేరళలోని పల్లిపురం సీఆర్‌పీఎఫ్ క్యాంపులో జరిగింది. క్యాంపులో ఆహారం తీసుకున్న అనంతరం జవాన్లు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులతో బాధపడుతుండడంతో వెంటనే వారిని త్రివేండ్రం వైద్య కళాశాలతోపాటు నగరంలోని వేర్వేరు ఆస్పత్రులకు తరలించారు. త్రివేండ్రం ఆస్పత్రిలోనే 109 మంది జవాన్లు చికిత్స పొందుతున్నారు. కేరళ ఆరోగ్యశాఖా మంత్రి కేకే శైలజ జవాన్లను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరాతీశారు.