: బొండా ఉమా సైతం రాజీనామాకు సిద్ధం!


ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గాన్ని విస్తరించాలన్న చంద్రబాబు ఆలోచన, మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న వారిని తీవ్ర నిరుత్సాహంలోకి నెట్టి వేయగా, పలువురు తమ అసంతృప్తిని బాహాటంగా ప్రదర్శిస్తూ, పదవులకు రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందిన బొజ్జల తన రాజీనామాను స్పీకర్ కు పంపించగా, బొండా ఉమా సైతం రాజీనామా బాటలో నడుస్తున్నారు. అసెంబ్లీలో చురుకుగా ఉంటూ, విపక్షంపై తరచూ నిప్పులు చెరుగుతూ ఉండే ఉమకు మంత్రి పదవి వస్తుందని వార్తలు వచ్చినప్పటికీ, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు పదవి లభించలేదు. దీంతో అలిగిన ఉమ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పడంతో, ఆయన్ను బుజ్జగించే బాధ్యతను ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు అప్పగించినట్టు సమాచారం. ప్రస్తుతం ఉమ ఇంటికి చేరుకున్న నాని, ఆయనతో చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News