: వికటించిన ఎమ్మెల్యే పంచాయితీ... కత్తులతో పొడుచుకున్న ఇరు వర్గాలు!

మహబూబ్ నగర్ మునిసిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్ల మధ్య నెలకొన్న వర్గపోరు సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చేసిన ప్రయత్నం విఫలమైంది. మునిసిపల్ చైర్ పర్సన్ భర్త అమర్, కౌన్సిలర్ ఆనంద్ ల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతుండగా, వాటిని పరిష్కరించే ఉద్దేశంతో శ్రీనివాస్ గౌడ్, తన ఇంట్లో పంచాయితీ నిర్వహించారు. లోపల ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్న సమయంలో బయట ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పరస్పరం కత్తులతో దాడులు చేసుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు కల్పించుకుని వారిని చెదరగొట్టి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News