: మద్యం మత్తులో తెలంగాణ మంత్రి తనయుడి హల్ చల్... అరెస్ట్


గత రాత్రి రోడ్డుపై హల్ చల్ చేస్తున్న తెలంగాణ మంత్రి అజ్మీరా చందూలాల్ కుమారుడు ధరమ్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడు జంక్షన్ సమీపంలో తన మిత్రులతో కలసి కారులో వచ్చిన ధరమ్ సింగ్, రోడ్డుపై తన వాహనాన్ని ఆపి పక్కన నిలుచున్న ప్రైవేటు డ్రైవర్ నరేశ్ తో గొడవపడ్డాడు. తాను హారన్ కొడుతుంటే, పక్కకు జరగవా? అంటూ పూటుగా మద్యం తాగిన మైకంలో చిందులు తొక్కాడు. కారు దిగి నరేశ్ పై దాడికి పాల్పడ్డాడు. తాను మంత్రి కొడుకునని హూంకరించాడు. పోలీసులు వచ్చి వారించినా వినలేదు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పినా, అందరినీ తన్నాలని ఆదేశాలు ఇచ్చాడు. దీంతో పోలీసులు ధరమ్ సింగ్ ను అదుపులోకి తీసుకుని స్టేషనుకు తరలించారు.

  • Loading...

More Telugu News