: ఏపీ కేబినెట్లో నుంచి ఐదుగురికి ఉద్వాసన?... ఛాన్స్ ఎవరికి?


ఆంధ్రప్రదేశ్ కేబినెట్ విస్తరణలో ఎంత మందికి స్థానం దక్కనుందో క్లారిటీ లేనప్పటికీ... ఇప్పుడు మంత్రి వర్గంలో ఉన్న ఐదుగురిని తొలగించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్ నాయకులతో, పలు దఫాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపై మంత్రులు పల్లె రఘునాధరెడ్డి, రావెల కిషోర్ బాబు, కిమిడి మృణాళిని, బొజ్జల, పీతల సుజాతకు ఉద్వాసన పలికారు. మంత్రి వర్గంలో తీసుకునే వారిని ఏ ప్రాతిపదికన తీసుకుంటున్నాము, మంత్రి వర్గం నుంచి ఏ ప్రాతిపదికన తొలగిస్తున్నాము? అన్న విషయాలను ఆయన వారికి వివరించినట్టు తెలుస్తోంది.

కాగా, ఏపీ కేబినెట్ విస్తరణలో ఎమ్మెల్సీ నారా లోకేష్ తో పాటు భూమా అఖిల ప్రియకు కూడా బెర్తు ఖరారైనట్టు సమాచారం అందుతోంది. అయితే మిగిలిన వారు ఎవరు? అన్నదానిపై అధ్యక్షుడు ప్రకటన చేసేంతవరకు నేతలు నోరు విప్పడం లేదు. కాగా, రేపు ఉదయం కొత్త శాసనసభ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం ఉన్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News