: మంత్రి వర్గంలోకి అనుభవమున్న వారిని తీసుకోండి!: విష్ణుకుమార్ రాజు
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు సమయం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఆశావహులు సీఎం ముందు తమ అర్హతలు ఏకరువుపెట్టగా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు జిల్లాలు, కులాలు, వర్గాల నేతలతో చర్చల్లో మునిగిపోయారు. బృందాల వారీగా ఆశావహులను, అర్హులను పిలిపించుకుని వారితో చర్చలు జరిపారు. అలాగే అసంతృప్తులను బుజ్జగిస్తూ ఆయన బిజీగా మారిపోయారు.
ఈ నేపథ్యంలో బీజేపీ శాసనసభ్యుడు విష్ణు కుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిలోకి కులాలు, సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవడం దారుణమని అన్నారు. మంత్రి వర్గంలోకి అనుభవమున్నవారిని తీసుకోవాలని ఆయన సూచించారు. విభజనతో ఏపీ ఇబ్బందులు పడుతోందని ఆయన చెప్పారు. అలాంటి ఏపీలో యుద్ధంలో ఎలాంటి వారిని పంపుతున్నామన్నది ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని ఆయన సూచించారు.