: శిఖర్ ధావన్ ను ఫూల్ చేసిన యువరాజ్ సింగ్


టీమిండియా ఆటగాళ్లలో ప్రాక్టికల్ జోక్స్ వేసుకునే ఆటగాళ్లలో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్ ముందుంటారు. వీరు ముగ్గురూ ఒక్కటైతే అక్కడ అల్లరే అల్లరి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో నేడు ఏప్రిల్ 1ని పురస్కరించుకుని యువరాజ్ సింగ్... ఓపెనర్ శిఖర్ ధావన్ ను ఫూల్ చేశాడు. ఇందుకోసం ప్రాంక్ ను ప్లే చేశాడు. ఐపీఎల్ ప్రారంభ వేడుకల కోసం హైదరాబాదు చేరుకున్న వీరిద్దరూ ఓ స్టార్ హోటల్ లో బస చేశారు. ఈ సందర్భంగా శిఖర్ తో యువరాజ్ సింగ్ 'మీ ఆవిడ అయేషా ఫోన్ చేసింది, ఏదో ఎమర్జెన్సీ అట... వెంటనే ఫోన్ చెయ్' అని ధావన్ కు చెప్పాడు. దీంతో స్విమ్మింగ్ చేస్తున్న ధావన్ వెంటనే, బయటకు వచ్చి, తుడుచుకుంటూ బ్యాగులో ఫోన్ కోసం వెతికాడు. తెగవెతుక్కుంటున్న ధావన్ ను యువీ ఆపి... ఏప్రిల్ ఫూల్ చేశానని తాపీగా చెప్పాడు. దీంతో తాను ఫూల్ అయ్యానని శిఖర్ అంగీకరించాడు. 

  • Loading...

More Telugu News