: ప్రజలు అలాగే అనుకుంటారు.. అనుకోనీ.. వాళ్ల పనే అది: నటి సోనాక్షి సిన్హా


నటి సోనాక్షి సిన్హా.. బంటీ సజ్‌దేతో రిలేషన్‌షిప్‌లో ఉందని బాలీవుడ్‌లో టాక్. వారిరువురూ క‌లిసి హాయిగా ఎంజాయ్ చేస్తుండ‌గా ప‌లుసార్లు  మీడియా కంట కూడా ప‌డ్డారు. వారిద్దరు పెళ్లి చేసుకుంటార‌ని కూడా అంద‌రూ అనుకున్నారు. ప‌లుసార్లు వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు వ‌చ్చాయ‌ని కూడా వార్తలు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే, ఈ వార్త‌ల‌పై సోనాక్షి సిన్హా స్పందించింది. ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ఈ అమ్మ‌డు మాట్లాడుతూ... త్వరలోనే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదని స్ప‌ష్టం చేసింది. ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటానో కూడా తన‌కు తెలియదని చెప్పింది. ప్రజలు అలాగే మాట్లాడుతూనే ఉంటారని, అలాగే అనుకోనివ్వండి అని స‌మాధానం ఇచ్చింది. ప్ర‌జ‌ల‌ పనే అది అని వ్యాఖ్యానించింది.

  • Loading...

More Telugu News