: అందుబాటులో ఉన్న మంత్రులందరూ వచ్చేయండి: చంద్రబాబు ఆదేశం
అందుబాటులో ఉన్న మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు అంశాలపై రెండు రోజులుగా చంద్రబాబు కసరత్తు చేస్తోన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు పలువురు మంత్రులతో ఆయన ఇప్పటికే చర్చలు జరిపారు. అసంతృప్తితో ఉన్న పలువురు నేతలను ఆయన బుజ్జగించారు. కొత్త మంత్రులుగా నియమించనున్న ఎమ్మెల్యేల అంశంపైనే ఆయన మంత్రి వర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకొని, భేటీ అనంతరం కొత్త మంత్రివర్గ జాబితా విడుదల చేస్తారని సమాచారం. ఆ వెంటనే ఆ జాబితాను గవర్నర్ నరసింహన్ కు పంపించనున్నారు. కొత్త మంత్రుల ఎంపికకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకున్నారో ఆ వివరాలను కూడా చంద్రబాబు మంత్రులకు వివరించనున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఈ రోజు రాత్రి ప్రకటన రానుంది.