: పొగాకును నమిలిన యూపీ సీఎం కారు డ్రైవర్.. రూ.500 ఫైన్ పడింది!
ఉత్తరప్రదేశ్‌లో సీఎం ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ విధుల్లో పాన్ మసాల, గుట్కా నమలడంపై నిషేదం విధించిన సంగతి విదితమే. అయితే, స్వయాన సీఎం యోగీ ఆదిత్యానాథ్ కారు డ్రైవరే ఆ నిబంధనలు ఉల్లంఘించడంతో వార్తల్లోకెక్కాడు. ప్రభుత్వ విధుల్లో ఉండగా సదరు డ్రైవర్ పొగాకును నమిలాడని, ఆ విషయాన్ని గుర్తించి అతనిపై చర్యలు తీసుకుంటూ రూ.500 జరిమానా విధించామని అక్కడి పోలీసులు తెలిపారు.