: అక్రమార్కులపై విరుచుకుపడుతున్న ఈడీ... రాజేశ్వర్ ఎక్స్పోర్ట్ ను వైఎస్ జగన్ ముసుగు సంస్థగా పేర్కొన్న ఈడీ
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తుల వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ రోజు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దేశ వ్యాప్తంగా ఏకకాలంలో 100 చోట్ల ఈడీ సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. ముంబైలో ఒకే అడ్రస్‌తో 700 సూట్‌కేస్ కంపెనీలను ఈడీ గుర్తించింది. వాటిల్లో రాజేశ్వర్ ఎక్స్పోర్ట్ సంస్థ కూడా ఉందని, అది వైఎస్ జగన్ కు సంబంధించిందని తేల్చింది. ఆ సంస్థ ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఈడీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. సూట్‌కేస్ కంపెనీలతో జగన్ కున్న సంబంధాలపై ఆరా తీసింది. నల్లధనం, అక్రమలావాదేవీలపై ఉక్కు పాదం మోపిన కేంద్ర ప్రభుత్వం అక్రమార్కుల భరతం పట్టడానికి అన్ని అంశాలను పరిశీలిస్తూ ముందుకు వెళుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల పలు ఆదేశాలు జారీ చేయడంతో ఈడీ ఈ రోజు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తోంది.
ED searches at shell companies related to Y S Jagan Reddy Rajeshwar Exports & others to unearth their modus operandi
— ED (@dir_ed) April 1, 2017