: ఇంతకంటే గొప్ప ఆనందాన్ని నేను పొందలేను: సౌందర్య రజనీకాంత్
తమిళంలో 'వీఐపీ-2' సినిమా షూటింగ్ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ సందడి చేశారు. తన కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో కలైపులి ఎస్.ధాను నిర్మిస్తున్న 'వీఐపీ-2' సినిమా షూటించి చివరి రోజున స్పాట్ కు రజనీకాంత్ వెళ్లారు. దీంతో యూనిట్ మొత్తం ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైంది. ఈ సినిమా హీరో ధనుష్... తన తండ్రి రజనీకాంత్ తో కలసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ... 'ఇంతకు మించిన ఆనందం ఉండదేమో' అని పేర్కొంది. 'వీఐపీ-2' చివరి రోజు షూటింగ్ ధనుష్, రజనీకాంత్ కు అంకితం అంటూ ట్వీట్ చేసింది. దీనికి వారి అభిమానుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. కాగా 'వీఐపీ' సినిమా గతంలో తెలుగులో వచ్చిన 'రఘువరన్ బీటెక్' సినిమాకు సీక్వెల్ కావడం విశేషం. ఈ సినిమాలో ధనుష్ సరసన అమలాపాల్ నటిస్తుండగా, బాలీవుడ్ నటి కాజోల్ ఒక కీలక పాత్ర పోషిస్తోంది.