: ఈ చిట్టి చిన్నారి నోటితో ముద్ద తినాలంటే... ఆపన్నుల సాయం కావాలి!


తమిళనాడుకు చెందిన ఎనిమిది నెలల శిశువు జ్ఞాన సౌందర్యన్ గతేడాది జూలై 25న అందరి చిన్నారుల్లానే అమ్మ కడుపు నుంచి భూమిపైకి వచ్చాడు. కానీ, పుట్టుకతోనే అన్నవాహిక పూడుకుని పోయి ఉంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడు చిన్నారిలో అన్నవాహిక సరిగా అభివృద్ధి చెందలేదని వైద్యులు గుర్తించారు. దీన్ని వైద్య పరిభాషలో ఈసోఫాజియల్ అట్రీసియా అంటారు. ఈ సమస్య కారణంగా అతడు ఆహారాన్ని తీసుకోలేని పరిస్థితి. పాలు పట్టించినా కడుపులోకి జారేవి కావు. తిరిగి నోటి ద్వారానే బయటకు వచ్చేసేవి. ఈ క్రమంలో అవి ఊపరితిత్లుల్లోకి వెళ్లేవి. ఇది ప్రాణానికి చాలా ప్రమాదం.

దీంతో వైద్యులు శస్త్రచికిత్స ద్వారా పొట్టకు రంధ్రం చేసి బయటి నుంచి ఓ పైప్ ద్వారా ఫీడింగ్ ఇస్తున్నారు. ఈ కారణంగా చిన్నారి పొట్ట భాగం కూడా పక్కకు జరిగింది. ఈ చిట్టి చిన్నారికి చికిత్సతోపాటు మేజర్ సర్జరీ ద్వారా సమస్యను సరిచేయాలని చెన్నైలోని కంచి కామకోఠి చైల్డ్ ట్రస్ట్ హాస్పిటల్  వైద్యులు స్పష్టం చేశారు. ఇందుకు రూ.3 నుంచి రూ.5 లక్షలు అవుతాయని తెలిపారు. కానీ సౌందర్యన్ తల్లిదండ్రులకు అంతటి స్తోమత లేదు. ఇప్పటి వరకూ చిన్నారికి చికిత్స కోసం, ప్రాథమిక సర్జరీ కోసం రూ.3 లక్షలకు పైన వ్యయం కాగా సౌందర్యన్ బంధువు అతుల్ ప్రకాష్ భరించారు. ఇప్పుడు దాతలు ముందుకు వస్తే గానీ ఈ చిన్నారికి వైద్యం ఇప్పించలేని పరిస్థితి.

ఈ బాధ్యతను, దాతల నుంచి విరాళాలను సేకరించే కార్యక్రమాన్ని మిలాప్ డాట్ ఓ ఆర్జీ అనే స్వచ్చంద సంస్థ చేపట్టింది. ఇప్పటి వరకు రూ.3,05,000 వసూలు అయ్యాయి. ఎంతో మంది ముందుకు వస్తున్నారు. కనీసం ఓ రూ.100 చదివించినా ఓ పసివాడి ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఈ కింది లింక్ ను సందర్శించడం ద్వారా ఆ చిన్నారి పరిస్థితిని కళ్లారా చూడవచ్చు. https://milaap.org/fundraisers/helpbaby-Gnanasoundharyan?utm_source=ctn&utm_campaign=cta-fund-open&utm_medium=cpc

  • Loading...

More Telugu News