: ఆర్కేనగర్లో శశికళ వర్గం నేతలకు చేదు అనుభవం... సీఆర్ సరస్వతిపైకి బూటు విసిరిన వ్యక్తి
తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఈ నెల 12న ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తోన్న అన్ని పార్టీలు హోరాహోరీగా ప్రచారంలో పాల్గొంటున్నాయి. అన్నాడీఎంకే అమ్మ అభ్యర్థిగా దినకరన్ పోటీకి దిగుతున్న నేపథ్యంలో ప్రచారం చేస్తోన్న అన్నాడీఎంకే నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఆ పార్టీ నేత సీఆర్ సరస్వతి ఆర్కే నగర్లో ప్రచారం చేస్తుండగా ఓ వ్యక్తి ఆమెపైకి బూటు విసిరాడు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ పార్టీ ఆర్కేనగర్ అభ్యర్థిగా శశికళ.. దినకరన్‌ను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. మరోవైపు డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే పురచ్చితలైవి అమ్మ అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేన కోడలు దీప పోటీ చేస్తున్నారు.