: మరో వివాదంలో ఇరుక్కున్న హీరోయిన్ అమలాపాల్
సినీ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచీ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వస్తోన్న సినీ నటి అమలాపాల్ తాజాగా మరో వివాదంలో పడింది. ఆమె యోగా చేస్తూ తీయించుకున్న ఓ ఫొటో వివాదానికి కారణమైంది. బుద్ధుడి ఫొటో ముందు యోగా చేస్తున్న ఈ బ్యూటీ శీర్షాసనం వేసి బుద్దుడి ముఖం మీద తన కాళ్లు పెట్టింది. ఈ ఫొటో బౌద్ధ మతాన్ని అనుసరించే వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని విమర్శలు ఎదుర్కుంటోంది. దీనిపై స్పందించిన బౌద్ధులు ఆ ఫోటోలను తొలగించాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై అమలా పాల్ నుంచి ఇంతవరకు సమాధానం లేదు.