: మరో బంప‌ర్ ఆఫ‌ర్ ప్రక‌టించిన‌ ఐడియా!


వినియోగ‌దారుల ముందు రిల‌యన్స్‌ జియో కురిపిస్తోన్న ఆఫ‌ర్ల ధాటికి మిగ‌తా టెలికాం రంగ కంపెల‌న్నీ దిగివ‌స్తూనే ఉన్నాయి. త‌మ ఉచిత ఆఫ‌ర్లు ముగుస్తోన్న నేప‌థ్యంలో జియో ఒకసారి రూ.303తో రీచార్జ్ చేసుకుంటే జూన్ చివరి వరకు ఉచిత సేవలు పొందవచ్చని బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మ‌రోవైపు ఈ రోజు బీఎస్ఎన్ఎల్ కూడా ఇటువంటి ఆఫ‌ర్‌నే ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఎన్నో ఆఫ‌ర్లు గుప్పించిన‌ ఐడియా కూడా ఈ రోజు మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది. ప్రత్యేక రీఛార్జీలతో త‌మ‌ పోస్ట్‌ పెయిడ్ 4జీ మొబైల్‌ వినియోగదారులకు రోజుకి 1జీబీ 4జీ  డాటాను అందించనుంది.
 
రూ.300 యాడ్ ఆన్ ప్యాక్‌తో రోజుకు 1 జీబీ చొప్పున నెల రోజుల పాటు 4జీ డేటాను అందించనున్నట్లు ఐడియా పేర్కొంది. రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ రెంటల్ ఉన్న పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు రూ. 50 అదనంగా చెల్లించి మూడు నెలలపాటు ఈ ఆఫర్‌‌ను పొందవ‌చ్చ‌ని కూడా తెలిపింది. అంతేగాక‌, మూడు నెలల తరువాత మార్చి 2018 వరకు ఈ  డిస్కౌంట్‌ ఆఫర్‌ పొందాలంటే రూ.199-రూ.349 మధ్య ప్లాన్‌లో అదనంగా రూ.200, రూ.349- రూ.498 మధ్య ప్లాన్‌లో అదనంగా రూ.50 చెల్లిస్తే సరిపోతుందని చెప్పింది.

ఈ నెల ముప్పై వ‌ర‌కు త‌మ వినియోగ‌దారులు ఈ రీచార్జ్ చేసుకొని ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. ఈ ఆఫర్‌ 4జీ హ్యాండ్‌సెట్లకు మాత్రమేన‌ని తెలిపింది. అంతేకాదు, రూ.349- రూ.498ల మధ్య రెంటల్‌ ప్లాన్‌ లో రూ.50 డిస్కౌంట్‌, అలాగే రూ.149-రూ.349 రెంటల్ ప్లాన్ పై సబ్ స్క్రైబ్ అయిన ఖాతాదారులకు రూ.100 డిస్కౌంట్‌ అందించనున్నట్టు చెప్పింది.

  • Loading...

More Telugu News