: ‘అమెరికా తదుపరి అధ్యక్షుడు సెహ్వాగ్ అంటూ కథనం’.. ట్విట్టర్ లో షేర్ చేసిన సెహ్వాగ్
ఇటీవల జరిగిన భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలుస్తూ ఆస్ట్రేలియా మీడియా కథనాలు రాయడం అలజడి రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ హా..హా అంటూ న్యూయర్క్ టైమ్స్ ప్రచురించిన ఓ కథనాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ హ్యాపీ 'ఏప్రిల్ ఫూల్స్ డే' అని అన్నారు. ప్రముఖ జర్నలిస్టు స్టీఫెన్ స్మిత్.. పత్రికలోని స్పోర్ట్స్ పేజీలో ఏమని పేర్కొన్నారంటే.. తరచూ అమెరికాకు వస్తున్న ట్విట్టర్ సూపర్‌స్టార్ వీరూతో అమెరికా ప్రభుత్వం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోందని రాశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు ఇద్దరూ కలిసి సెహ్వాగ్‌ను అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారని అందులో పేర్కొన్నారు. ఈ ఏడాది అమెరికా పర్యటనకు మోదీ వెళ్లనున్న నేపథ్యంలో వారిరువురూ మోదీతో ఈ మేరకు చర్చిస్తారని సెహ్వాగ్ పోస్ట్ చేసిన ఆ న్యూస్ కథనంలో ఉంది. విరాట్ కోహ్లీని ఆస్ట్రేలియా మీడియా ట్రంప్ తో పోల్చుతూ కథనం ప్రచురించిన నేపథ్యంలోనే సెహ్వాగ్.. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఉద్దేశించి ఇన్ డైరెక్టుగా ఇలా వ్యంగ్యంగా ఉన్న కథనాన్ని షేర్ చేసినట్లు తెలుస్తోంది. ఫూల్స్ డే సందర్భంగా సరదాగా ‘న్యూయార్క్ టైమ్స్’ వార్తా సంస్థ ఈ రోజు ఓ కథనాన్ని ప్రచురించింది.
Hahaha ! pic.twitter.com/xyvzQV1Ug8
— Virender Sehwag (@virendersehwag) April 1, 2017