: రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యధాతథం


ఆరోగ్యశ్రీ విధానంలో లోటుపాట్లపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. సర్కారు ఇటీవలే ప్రతిపాదించిన ఉద్యోగశ్రీ అమలుకు తమకెలాంటి అభ్యంతరం లేదని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సంఘం పేర్కొంది. అంతేగాకుండా, ఆరోగ్యశ్రీ అమలులో అక్రమాలు జరిగితే తామే ఆసుపత్రుల సంఘం తరుపున చర్యలు తీసుకుంటామని తెలిపింది. కాగా, సీఎంతో చర్చలు సఫలమైన నేపథ్యంలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యధాతథంగా కొనసాగుతాయని ఆసుపత్రుల సంఘం హామీ ఇచ్చింది.

  • Loading...

More Telugu News