: సినీ నటుడు విశాల్ శపథం... అప్పటి వరకూ పెళ్లి చేసుకోడట!


తమిళ హీరో విశాల్ ఓ శపథం చేశాడు. దక్షిణ భారత నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. సంఘం నూతన భవన నిర్మాణానికి ఈ రోజు చెన్నైలోని టి.నగర్ అబీబుల్లా రోడ్డులో శంకుస్థాపన జరిగింది. అగ్ర నటులు రజనీకాంత్, కమల్ హాసన్ దీన్ని ప్రారంభించారు.

 ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి విశాల్ మాట్లాడుతూ... ఈ భవన నిర్మాణాన్ని ఆపడానికి చేసే ప్రయత్నాలను అధిగమించి పూర్తి చేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేసి దీన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అప్పటి వరకూ తాను పెళ్లి చేసుకోనని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అజిత్, సత్యరాజ్, సూర్య, శింబు, అరుణ్ విజయ్, శివకుమార్, శారద, కాంచన, వైజయంతీమాల, కోవైసరళ, లత ఇంకా చాలా మంది నటీనటులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News