: దలైలామా విషయంలో భారత్ తప్పు చేసిందంటున్న చైనా


మరోసారి పొరుగు దేశం చైనా బౌద్ధ మత గురువు దలైలామా విషయంలో భారత్ తీరును తప్పుబట్టింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దలైలామా పర్యటించేందుకు భారత ప్రభుత్వం అనుమతించింది. సరిహద్దు రాష్ట్రంలోకి దలైలామాను అనుమతించవద్దని చైనా చేసిన డిమాండ్ ను మన దేశం పట్టించుకోలేదు. దీంతో దలైలామాను అరుణాచల్ ప్రదేశ్ లోకి అనుమతిస్తూ భారత్ పెద్ద తప్పు చేస్తోందంటూ చైనా అక్కసు వెళ్లగక్కింది. ఈ చర్య ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లుకాంగ్ ఇప్పటికే వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతంలో దలైలామా ఎటువంటి చర్యలకు పాల్పడినా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఈ విషయంలో తమ ఆందోళనను ఇప్పటికే భారత ప్రభుత్వానికి తెలిపామని ఆయన వెల్లడించారు. 

  • Loading...

More Telugu News