: రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నేడు సత్యంబాబు విడుదల!


అయేషా మీరా హత్య కేసులో సత్యంబాబును నిర్దోషిగా హైకోర్టు ప్రకటించడంతో అతడు ఈ రోజు జైలు నుంచి విడుదల కానున్నాడు. ప్రస్తుతం అతడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు అతడ్ని ఈ రోజు విడుదల చేయనున్నారు. బీఫార్మసీ విద్యార్థిని అయిన అయేషా మీరా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో వసతి గృహంలో 2007లో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆమెపై సత్యంబాబు అత్యాచారం చేసి, హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ చేసిన వాదనలతో ఏకీభవించిన కింది కోర్టు సత్యం బాబును దోషిగా ప్రకటించి జీవత ఖైదు విధించింది. దీంతో ఎనిమిదేళ్లుగా సత్యం బాబు జైలుకు పరిమితం అయ్యాడు. అయితే, సత్యంబాబు తరఫున హైకోర్టుకు వెళ్లడంతో, ఈ కేసులో అతడు నిర్దోషి అని, అమాయకుడైన అతడ్ని అన్యాయంగా జైల్లో పెట్టారని హైకోర్టు నిన్న విచారణ సందర్భంగా తప్పుబట్టిన సంగతి విదితమే. 

  • Loading...

More Telugu News