: తిరుమలకు ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావద్దు: భక్తులకు సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ సూచన
సినీనటుడు రాజేంద్ర ప్రసాద్ ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వేంకటేశ్వరుడి సేవలో పాల్గొన్న ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుమలేశుడి దర్శనం తనకు పరమానందాన్ని కలిగించిందని చెప్పారు. తిరుమలకు ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావద్దని ఈ సందర్భంగా ఆయన భక్తులకు సూచన చేశారు. అలాగే నీటిని వృథా చేయకూడదని అన్నారు.