: బీఎస్ఎన్‌ఎల్ మరో ఆఫర్.. రూ.249తో రోజుకు 10 జీబీ.. అపరిమిత కాల్స్


ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరో ఆఫర్ ప్రకటించింది. రూ.249 ప్లాన్‌తో అపరిమిత బ్రాండ్ బ్యాండ్ సేవలు ప్రకటించింది. 2 ఎంబీపీఎస్ వేగం, ఉచిత ఇన్‌‌స్టలేషన్‌తో ‘ఎక్స్‌పీరియన్స్ అన్‌లిమిటెడ్ జీబీ’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో వినియోగదారులు రోజుకు 10 జీబీ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. వైర్‌లైన్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల కింద ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు బీఎస్ఎన్ఎల్ తెలిపింది.

  • Loading...

More Telugu News