: వారి రాసలీలలు చూసిందనే నా కుమార్తెను పొట్టన పెట్టుకున్నారు: అయేషా తల్లి
అయేషా మీరా హత్యకేసులో సత్యంబాబును నిర్దోషిగా పేర్కొంటూ శుక్రవారం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన అయేషా మీరా తల్లిదండ్రులు.. అసలు దోషులను పట్టుకుని శిక్షిస్తేనే తమ కుమార్తె ఆత్మకు శాంతి కలుగుతుందని పేర్కొన్నారు. సత్యంబాబు నిర్దోషి అని తొలి నుంచి తాము చెబుతూనే ఉన్నామని అయేషా తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషాలు పేర్కొన్నారు. హాస్టల్ వార్డెన్ కోనేరు పద్మ నోరు తెరిస్తే ఐదు నిమిషాల్లోనే కేసు పరిష్కారమవుతుందన్నారు. పద్మ, ఆమె భర్త అయినంపూడి శివరామకృష్ణ, హాస్టల్ విద్యార్థులు సౌమ్య, ప్రీతి, కవిత, కోనేరు సురేశ్, కోనేరు సతీష్, అబ్బూరి గణేశ్, చింతా పవన్‌కుమార్‌లకు ఈ కేసుతో సంబంధం ఉందని, వారే నిందితులని పేర్కొన్నారు. అయేషా వారి రాసలీలలను చూసిందనే కారణంతోనే పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. కేసును తిరిగి దర్యాప్తు చేసి అసలు దోషుల్ని పట్టుకోవాలని షంషాద్ బేగం విజ్ఞప్తి చేశారు.