: పోలండ్‌లో భారతీయ విద్యార్థిపై దాడి.. తప్పిన ప్రాణాపాయం
పోలండ్‌లో ఓ భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. పోజ్నన్ నగరంలోని ఓ ట్రామ్ వాహనంలో గుర్తు తెలియని దుండగుడు విద్యార్థిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అయితే భారతీయ విద్యార్థిపై కొందరు దాడి చేయడంతో అతడు మరణించాడంటూ స్థానిక మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని ఓ వ్యక్తి విదేశాంగమంత్రి సుష్మస్వరాజ్ దృష్టికి తీసుకొచ్చాడు. దీంతో స్పందించిన ఆమె పోలండ్‌లోని భారత రాయబారి నుంచి నివేదిక కోరారు. మరోవైపు అమెరికాలోని ఇండియానాలో మోన్రో ఆస్పత్రిలో పనిచేస్తున్న సిక్కు వైద్యుడు డాక్టర్ అమన్‌దీప్ సింగ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చింది. వివిధ మతాలకు చెందిన వారిని గతంలోనూ చంపానని ఆగంతుకుడు ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు.