: పూణేకు షాక్... ఐపీఎల్ కు అశ్విన్ దూరం?


ఐపీఎల్ సీజన్ 10లో పూణే సూపర్ జెయింట్ కు షాక్ తగిలింది. పూణే కీలక స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. ఇటీవలే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ లో ఆడిన అశ్విన్ సిరీస్ ముగిసిన తరువాత బెంగళూరులో ఏర్పాటు చేసిన ఫిట్ నెస్ శిబిరంలో పాల్గొన్నాడు. అన్ని పరీక్షల్లో పాల్గొన్న అశ్విన్ కు ఆరు నుంచి ఏడు నెలల విశ్రాంతి అవసరమని జట్టు ఫిజియో సూచించినట్టు తెలుస్తోంది.

ఐపీఎల్ తరువాత బీసీసీఐ నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ శిక్షణ నాటికి సిద్ధంగా ఉండాలని జట్టు యాజమాన్యం ఆదేశించింది. దీంతో అశ్విన్ ఐపీఎల్ కు దూరమవ్వనున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు పూణే జట్టు ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించడం ఆ జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశం వుంది. దీంతో ఐపీఎల్ లో గత సీజన్ లో ఏమాత్రం రాణించని పూణే ఈసారైనా రాణిస్తుందా? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. 

  • Loading...

More Telugu News