: అవి రెండు ఒకటే అయితే, నమాజ్ చేసేందుకు యూపీ సీఎం ఇష్టపడతారా?: ఆజం ఖాన్
సూర్య నమస్కారాలు, నమాజ్ ఒకటే అంటూ యూపీ సీఎం ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ స్పందించారు. అవి రెండూ ఒకటే అయితే, నమాజ్ చేయడానికి యోగి ఆదిత్యనాథ్ ఇష్టపడతారా? అని ప్రశ్నించారు. సూర్య నమస్కారాలు, నమాజ్ ఒకటేనని ఆదిత్య నాథ్ ఎలా గ్రహించారని, ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని అని ప్రశ్నించారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే ముస్లింలు శాకాహారం తింటున్నారని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆజంఖాన్ చెప్పారు. సింహం గడ్డి తినదు కానీ, కొన్ని సందర్భాల్లో బతకడం కోసం తినాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు.