: మాతా వైష్ణోదేవి భక్తులకు శుభవార్త.. హెలికాఫ్టర్ చార్జీల తగ్గింపు!


జమ్మూ కాశ్మీర్ లో కొలువుదీరిన మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించాలనుకునే భక్తులకు శుభవార్త. హెలికాఫ్టర్ ప్రయాణం చార్జీలను తగ్గించాలని ఆలయ బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం కొత్త రేట్ల వివరాలు.. కాట్రా-సాంజిచాట్ మధ్య ఒక వైపు ప్రయాణ చార్జీ రూ.1077 (పన్నులు సహా). పాత రేట్ల ప్రకారం అయితే, పన్నులు సహా రూ.1170గా ఉండేది. తగ్గించిన రేట్లు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నట్టు మాతా వైష్ణోదేవి మందిర బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి అజీత్ కుమార్ సాహు పేర్కొన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News