: ఏప్రిల్ 7న 'బాహుబలి' తొలిభాగం మరోసారి రిలీజ్!


2015లో విడుదలై తెలుగు సినీ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ‘బాహుబలి: ది బిగినింగ్’ చిత్రాన్ని మరోసారి విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. దీంతో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 28న ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ విడుదల కానున్న నేపధ్యంలో మరోసారి మొదటి భాగాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. దీంతో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్ర‌లు పోషించిన ‘బాహుబలి’ మొదటి భాగం మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • Loading...

More Telugu News