: 'అమ్మో.. ఆ బంగ్లానా.. వద్దులెండి!' అంటూ వణికిపోతున్న యూపీ మంత్రులు!


ఆ బంగ్లా ఊసెత్తితే చాలు, యూపీలోని మంత్రులు, అధికారులు వణికిపోతున్నారట. ఎందుకంటే, ఆ బంగ్లాలో అంతకుముందు నివసించిన వారు జైలు పాలో, అనారోగ్యం పాలవడమో జరిగిందట. దీంతో, ఆ బంగ్లాలో నివసించేందుకు ఏ ఒక్క మంత్రి గానీ, అధికారి గానీ ముందుకు రావట్లేదని తెలుస్తోంది. ఇంతకీ ఆ బంగ్లా ఎక్కడుందంటే .. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారిక నివాసం పక్కనే.

లక్నోలోని 5- కాళీదాస్ మార్గ్ లో సీఎం అధికారిక నివాసం ఉంది. ఆ పక్కనే ఉన్న 6- కాళీదాస్ మార్గ్ లో ఈ బంగ్లా ఉంది. అంతకుముందు, ఆ బంగ్లాలో వున్న సమాజ్ వాదీ పార్టీలో ప్రధాన పాత్ర పోషించిన అమర్ సింగ్, నాడు అఖిలేష్ యాదవ్ మంత్రి వర్గంలో పని చేసిన జావేద్ అబ్ది, వకర్ అహ్మద్ షా.. వంటి వారు పలు కారణాలతో తమ మంత్రి పదవులు కోల్పోయారని, అనారోగ్యం పాలయ్యారని ప్రచారంలో ఉంది.

అంతేకాకుండా, మాయావతి నాడు సీఎంగా ఉన్న సమయంలో ఆమెకు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన బాబు సింగ్ కుశ్వర్ కూడా ఈ బంగ్లాలోనే నివాసం వుండేవారు. ఆయన ఓ కుంభకోణం కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే ఆ బంగ్లాలో నివాసం ఏర్పరచుకునేందుకు యూపీ మంత్రులు, అధికారులు ముందుకు రావట్లేదట.

  • Loading...

More Telugu News