: సైనాపై సింధు ప్రతీకారం తీర్చుకుందా?


బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ పై ఒలింపిక్ స్టార్ పీవీ సింధు ప్రతీకారం తీర్చుకుందా? గతంలో ఓ సారి తలపడిన సందర్భంగా ఓటమిపాలైన సింధు... ఇండియన్ ఓపెన్ సిరీస్ 2017 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ లో మరోసారి సైనాతో తలపడింది. కోచ్ పుల్లెల గోపీచంద్ సారధ్యంలో సైనా, సింధు శిక్షణ తీసుకున్నారు. ఆ క్రమంలో ఓ సారి ఎదురెదురుగా ఆడిన సమయంలో సైనా విజయం సాధించింది. ఆ తర్వాత సైనా గోపీచంద్ కు బై చెప్పి, బెంగళూరు అకాడమీకి వెళ్లిపోయింది. సింధు మాత్రం గోపీచంద్ సారధ్యంలోనే శిక్షణ తీసుకుంటూ రియో ఒలింపిక్స్ లో రజతపతకం సాధించింది. అనంతరం వీరిద్దరి మధ్య మ్యాచ్ జరగలేదు. నేడు ఢిల్లీలోని శ్రీ ఫోర్ట్ కాంప్లెక్స్ లో జరిగిన మ్యాచ్ లో సైనాపై 21-16, 22-20 తేడాతో సింధు విజయం సాధించింది. దీంతో లెక్క సమం చేసింది. 

  • Loading...

More Telugu News