: భారత జట్టుకు భయమా?... అదేం లేదే!: మిస్బా, అఫ్రిదీ


తమతో క్రికెట్ ఆడేందుకు టీమిండియా భయపడుతోందని పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్ సర్ఫ్ రాజ్ అహ్మద్ పేర్కొనడంపై టెస్టు కెప్టెన్ మిస్బావుల్ హక్, దిగ్గజ ఆటగాడు షాహిద్ అఫ్రిదీ పెదవి విరిచారు. పాక్ తో ఆడేందుకు టీమిండియాకు భయమా? అలాంటిదేమీ లేదని అన్నారు. అది కేవలం సర్ఫ్ రాజ్ అహ్మద్ వ్యక్తిగత అభిప్రాయమని వారు పేర్కొన్నారు. పాకిస్థాన్ తో టీమిండియా క్రికెట్ ఆడకపోవడానికి కారణం ఏంటో అందరికీ తెలుసని వారు తెలిపారు. రాజకీయాలే పాక్ తో భారత్ క్రికెట్ ఆడేందుకు అడ్డంకి అని వారు స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం అనుమతిస్తే ఏ క్షణమైనా టీమిండియా ఆడేందుకు రెడీ అని వారు తెలిపారు. పాక్ తో ఆడేందుకు టీమిండియా భయపడుతుందనడం సరైనది కాదని వారు స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News