: మేమిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ ... రహానే, స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు


ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, తాను మంచి స్నేహితులమని టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే తెలిపాడు. రైజింగ్ పూణే సూపర్ జెయింట్ జెర్సీ ఆవిష్కరణ సభలో రహానే, స్మిత్ మాట్లాడుతూ, తామిద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ మని పేర్కొన్నారు. ఈ మధ్యే ముగిసిన టెస్టు సరీస్ లో ఆసీస్, భారత జట్ల మధ్య మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ తాము క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆకట్టుకున్నాయి. రహానే, స్మిత్ ఫాంలో ఉండడం పట్ల పూణే జట్టు యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. టోర్నీలో తమ ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరుతో రాణించి ఆకట్టుకుంటారని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఈ సమావేశంలో మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కనిపించకపోవడం విశేషం. 

  • Loading...

More Telugu News