: ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నట్లు ఈఆర్సీ ఈ రోజు ప్రకటించింది. ఏ, బీ వార్షిక యూనిట్లను తగ్గించాలన్న విద్యుత్ సంస్థల ప్రతిపాదనను తొలగించాలని వచ్చిన ప్రతిపాదనలను తాము తోసిపుచ్చుతున్నట్లు వెల్లడించింది. 2017-18 సంవత్సరంలో 3.6 శాతం విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. మరోవైపు 15.47 వ్యవసాయ కనెక్షన్లకు మాత్రం ఎటువంటి విద్యుత్ ఛార్జీలు లేవని తెలిపింది. విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై మొత్తం రూ.800 కోట్ల భారం పడనుంది.