: జాతీయ, రాష్ట్ర రహదారులకి 220 మీటర్ల దూరంలోనే మద్యం షాపులు ఉండాలి: సుప్రీం తీర్పు
జాతీయ, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలోనే మద్యం దుకాణాలను ఏర్పాటు చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఈ రోజు ఆదేశాలు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, ప్రస్తుత లైసెన్సు గడువు ముగిసేంత వరకు మద్యం షాపులు ఇప్పుడెక్కడున్నాయో అక్కడే నడుపుకోవచ్చని తెలిపింది. లైసెన్స్ గడువు ముగిసిన అనంతరం 20,000 జనాభా ఉన్న పట్టణాల్లో జాతీయ, రాష్ట్ర రహదారులకు 220 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేయాలని, అంతకు లోపల ఏర్పాటు చేస్తే శిక్షతో పాటు జరిమానా కూడా విధించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఇప్పుడున్న మద్యం షాపుల లైసెన్స్ ల గడువు ఆంధ్రప్రదేశ్ లో జూన్ 30వ తేదీతో, తెలంగాణలో సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఆ తరువాత మద్యం షాపులు జాతీయ, రాష్ట్ర రహదారులకు దూరంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.