: పాక్ లో దారుణం.. కారుబాంబు పేలుడులో 22 మంది మృతి!
పాకిస్థాన్ లో దారుణం చోటు చేసుకుంది. గిరిజన జిల్లాలో బాంబు పేలుడు సంఘటనలో 22 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. షియా మతస్తులు ఎక్కువగా ఉండే కుర్రమ్ గిరిజన జిల్లాలోని పరచినార్ మార్కెట్ లో ఓ కారు బాంబు పేలడంతో ఈ దారుణం జరిగింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ సంఘటనకు బాధ్యులం తామేనంటూ ప్రముఖ ఉగ్రవాద సంస్థ తాలిబాన్ ప్రకటించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.