: కొత్త గాళ్ ఫ్రెండ్ తో జస్టిన్ బీబర్ షికార్లు!
యువ పాప్ స్టార్ జస్టిన్ బీబర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. నిత్యం ఏదో వివాదంతో వార్తలకెక్కే బీబర్ ఈసారి కొత్త గర్ల్ ఫ్రెండ్ తో కనిపించి సందడి చేశాడు. బ్రెజిల్ రాజధాని రియో డీ జెనీరోలో స్టేజ్ షోలో పాల్గొన్న బీబర్... కొత్త గాళ్ ఫ్రెండ్ తో కనిపించాడు. స్టేజ్ షో ముగిసిన అనంతరం తను బస చేసిన సోఫానా హోటల్ లో పార్టీకి హాజరయ్యాడు. ఆ యువతి బ్రెజిల్ లో పేజ్ త్రీలో కనిపించే లూసియానా చామోన్ అయ్యుంటుందని, ఆమెకు మారినా పుమార్ అనే స్నేహితురాలు ఉందని, ఆమెను కూడా వారు పార్టీకి తీసుకెళ్లారని హాలీవుడ్ లైఫ్ వెబ్ సైట్ పేర్కొంది. కాగా, బీబర్ జీవితాన్ని అనుభవిస్తూ పలు సందర్భాల్లో విమర్శలకు గురైన సంగతి తెలిసిందే.