: అలా చేయకుంటే మరో ఉద్యమం తప్పదు: కేంద్ర సర్కారుకి స్టాలిన్ హెచ్చరిక
తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కేంద్ర సర్కారు ముందు ఓ డిమాండ్ ఉంచుతూ అలా చేయకుంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. తమ రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న హిందీ సైన్ బోర్డులను తమిళంలోకి మార్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వం ముందు డిమాండ్ ఉంచారు. హిందీకి ప్రాధాన్యత ఇచ్చి తమ భాషను తక్కువ చేసి చూడకూడదని, అలా చేస్తే తాము ఊరుకోబోమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమపై బలవంతంగా హిందీ రుద్దకూడదని అన్నారు. దేశమంతా త్రిభాషా సూత్రం అమలు చేయాలని కేంద్రం ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తమిళనాడు పాటించడం లేని విషయం తెలిసిందే.