: అమెరికా ఎన్నికల్లో జోక్యంపై సమాధానమా?... నా పెదాలను చూడండి!: వ్లాదిమిర్ పుతిన్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందని, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు కావడం వెనుక పుతిన్ హస్తముందని చాలా కాలంగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే అమెరికా నేత ఒకరు మాట్లాడుతూ, రష్యా చర్యల వల్ల రష్యా-అమెరికా మధ్య భీకర యుద్ధం జరిగే అవకాశం ఉందంటూ జోస్యం కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఆర్కెంజెస్క్ లో నిర్వహిస్తున్న ఆర్కిటిక్ ఫోరంలో ఈ వివాదంపై సమాధానం చెప్పాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అడగగా.... తన పెదాలను చూడాలని పుతిన్ వ్యాఖ్యాతను కోరారు. అంతా ఆయన ఏం చెబుతారా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నంతలో... 'నో' అని కళ్లు పెద్దవి చేసి, పెద్దగా చెప్పారు. దీంతో ఆడిటోరియం చప్పట్లతో మార్మోగింది.