: ఛోటా రాజన్ కి టీవీ ఇచ్చారుగా... నాక్కూడా ఇవ్వండి!: తీహార్ జైల్లో డిమాండ్ చేస్తున్న మాజీ ఎంపీ షాబుద్దీన్
ఢిల్లీలోని తీహార్ జైల్లో బీహార్ మాజీ ఎంపీ షాబుద్దీన్ మాఫియా డాన్ ఛోటా రాజన్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఆధిపత్యపోరులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఛోటా రాజన్ గదిలో టీవీ ఏర్పాటు చేయడంపై షాబుద్దీన్ మండిపడ్డాడు. తనకు కూడా టీవీ కావాలని షాబుద్దీన్ డిమాండ్ చేశాడు. ఛోటా రాజన్ పెద్దగా సౌండ్ పెట్టుకోవడంతో తనకు నిద్రాభంగమవుతోందని అధికారులపై మండిపడ్డాడు. ఈ మేరకు జైలు ఉన్నతాధికారులకు లేఖ రాసిన షాబుద్దీన్ టీవీ లేక పోవడంతో బోర్ కొడుతోందని, జైలులో ఒంటరితనం వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. 45 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న షాబుద్దీన్ ను తీహార్ జైలులోని కరుడుగట్టిన నేరగాళ్లను ఉంచే ఒకటో నెంబర్ జైలులో ఉంచారు. అక్కడ భద్రతను తమిళనాడు పోలీసు బలగాలు పర్యవేక్షిస్తుంటాయి.