: తమిళ రైతులను పరామర్శించిన రాహుల్ గాంధీ
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న తమిళనాడు రైతులను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కరవు భత్యం ఇచ్చి ఆదుకోవాలనే తమిళనాడు రైతుల డిమాండ్ ను వెంటనే అమలు చేయాలని అన్నారు. ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేస్తూ, ధనికులకు రుణ విముక్తి చేసిన ప్రధాని మోదీ, రైతులను మాత్రం విస్మరిస్తున్నారని అన్నారు. రైతుల ఆవేదనపై మోదీ తక్షణం స్పందించాలని రాహుల్ డిమాండ్ చేశారు. కాగా, కొన్ని రోజులుగా తమిళనాడు రైతులు ఢిల్లీలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు పండకపోవడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.