: న్యాయం గెలిచింది... సత్యం బాబుకు సంబంధం లేదు :బాధితురాలి తల్లి


విజయవాడలోని ఓ హాస్టల్ లో బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరాను అంత్యంత పాశవికంగా 2007లో హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సెషన్స్ కోర్టు నిందితుడు సత్యం బాబుకు జీవిత ఖైదు విధించగా, దీనిని విచారించిన హైకోర్టు ఈ కేసులో సత్యంబాబు నిర్దోషి అని ప్రకటించింది. దీనిపై బాధితురాలు ఆయేషా మీరా తల్లి షంషాద్‌ బేగం హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ఆమె మాట్లాడుతూ, ఈ కేసులో చివరకు న్యాయమే గెలిచిందని అన్నారు. న్యాయ వ్యవస్థ మంచి తీర్పు ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. కోర్టు ఆదేశించినట్టు పోలీసులకు సత్యంబాబుకు లక్ష రూపాయలు కాదని, కోటి రూపాయలు నష్ట పరిహారం ఇవ్వాలని ఆమె డిమాండ్‌ చేశారు. తాను మొదటి నుంచి సత్యం బాబు నిర్దోషని చెబుతున్నానని ఆమె అన్నారు. అసలు నిందితులను వదిలేసి పోలీసులు నాటకాలాడారని, అసలు దోషులను శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. 

  • Loading...

More Telugu News