: టీమిండియా లోయర్ ఆర్డర్ ఆటగాళ్లపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు
టీమిండియా లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు ఇటీవల జరిగిన పలు మ్యాచుల్లో బ్యాటింగ్‌లో రాణించి జట్టుకి విజయాన్ని అందించడం పట్ల మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించాడు. వారు అద్భుతాలు సృష్టించి జట్టుకి విజయాన్ని తెచ్చి పెట్టారని అన్నాడు. సొంత గడ్డపై ఇటీవలి కాలంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై జరిగిన సిరీసుల్లో 13 మ్యాచ్‌లాడి అందులో 10 మ్యాచులను టీమిండియా గెలిచిన విషయం తెలిసిందే. టీమిండియాకు ఇదొక గొప్ప హోమ్ సీజన్ అని, గడ్డు పరిస్థితుల్లో 7, 8, 9 స్థానాల్లోని బ్యాట్స్‌మెన్ ఎంతో బాగా ఆడారని సచిన్ అన్నాడు. భారత్ ఓడిపోయే పరిస్థితుల్లో మ్యాచ్‌ను గెలిపించారని ప్రశంసించాడు. మరోవైపు కీపర్ వృద్ధిమాన్ సాహా ఈ సీజన్‌లో మూడు సెంచరీలు నమోదు చేసుకోవడం గొప్ప విషయమని అన్నాడు. టీమిండియాపై తనకు ఎంతో విశ్వాసం ఉందని సచిన్ పేర్కొన్నాడు.