: స్టంపులు పీకి కోహ్లీని బాదాలని అనుకున్నా: ఎడ్ కోవెన్ సంచలన వ్యాఖ్య


ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టు మ్యాచ్ ల సిరీస్ ముగిసిన తరువాత కూడా ఆటలో భాగంగా మొదలైన వివాదాస్పద వ్యాఖ్యల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు సహా, ఆసీస్ మీడియా సైతం భారత జట్టుపై ఆరోపణల అభాండాలు మోపగా, తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ ఎడ్ కోవెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్ తో తానాడిన ఓ సిరీస్ ను గుర్తుకు తెచ్చుకుని, ఆ మ్యాచ్ లో కోహ్లీ తనను నిందిస్తుంటే, ఏమంటున్నాడో అర్థం కాలేదని, అతని భావం తెలుసుకుని, ఓ స్టంపును పీకి అతన్ని బాదాలని అనుకున్నానని 'ఫాక్స్ స్పోర్ట్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. కోహ్లీ మాటలు అప్పట్లో తనకు ఎంతమాత్రమూ అర్థం కాలేదని చెప్పాడు. తమ మధ్య జరుగుతున్న గొడవను సర్దేందుకు అంపైర్లు కల్పించుకున్నారని గుర్తు చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News