: ముందు అది నేర్చుకోండి సార్... అచ్చెన్నాయుడి ఇంగ్లీష్ ను సరిచేసిన జగన్... సభలో నవ్వులు!


ఆక్వా ఫ్యాక్టరీలో ప్రమాదంపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం తరఫున మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేయగా, ఆపై జగన్ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు కురిపించాయి. "మొట్టమొదట మన మంత్రిగారిని ఇంగ్లీష్ కరెక్ట్ చేసుకోమని చెప్పండి అధ్యక్షా... అది కామన్ ఎఫెక్ట్ ట్రీట్ మెంట్ ప్లాంటు కాదు... కామన్ ఆఫ్లివేట్ ట్రీట్ మెంట్ ప్లాంటు. అది నేర్చుకో సార్" అన్నారు. ఆపై అచ్చెన్నాయుడు మాట్లాడుతూ "నీలాగా నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకోలేదు జగన్ మోహన్ రెడ్డి. నేను నేలమీద, మట్టిలో కూర్చుని చదువుకున్నాను. నీకు, నాకు తేడా వుంది. నీలాగా చదువుకుని నాకు ఇంగ్లీష్ వస్తే, నీకు ఒక్క నిమిషం కూడా మాట్లాడేందుకు అర్హత లేకుండా చేద్దును. నాకు ఇంగ్లీషుగానీ, హిందీగానీ వస్తే, నువ్వీ సభలో ఒక్క నిమిషం కూడా ఉండకపోదువు. ఎండలో పరిగెత్తుకు పారిపోయే పరిస్థితి వస్తుంది. నీలాగా డబ్బులుండి, నేను కూడా చదివివుంటే పరిస్థితి ఇలా ఉండదు" అన్నారు. విషయాన్ని రాజకీయం చేయకుండా సలహాలు ఇవ్వాలని కోరారు. 

  • Loading...

More Telugu News