: మొగల్తూరు ప్రమాద ఘ‌ట‌న‌పై ఏపీ అసెంబ్లీలో ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న


పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని ఆక్వాఫుడ్ పరిశ్రమలో నిన్న జరిగిన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ఈ రోజు ఆంధ్రప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేసింది. స‌ర్కారు త‌ర‌ఫున మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... వ్య‌ర్థాల ట్యాంకులో మ‌రమ్మ‌తు స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు కార్మికులు మృతి చెందారని అన్నారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌పై సీఎం ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక తెప్పించుకున్నార‌ని చెప్పారు. మృతుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌ల చొప్పున ప్ర‌క‌టించామ‌ని చెప్పారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు.

ఆ ప‌రిశ్ర‌మ‌కు పొల్యూష‌న్ కంట్రోల‌ర్ బోర్డ్  అనుమ‌తులు ఇచ్చిందని అచ్చెన్నాయుడు చెప్పారు.  2025 వ‌ర‌కు ఈ ప‌రిశ్ర‌మ‌కు అనుమ‌తులు ఉన్నాయని అన్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే మంత్రులు బాధిత కుటుంబాలను పరామర్శించి, వారిని ఆదుకుంటామని ధైర్యం చెప్పారని అన్నారు. 

  • Loading...

More Telugu News