: ప్రేమ జంటను గుర్తించి చితక్కొట్టిన స్ధానికులు
ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంటను గుర్తించిన స్థానికులు వారిని పట్టుకొని కర్రలతో, పిడిగుద్దులతో చితక్కొట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో బయటపడినప్పటికీ దీనిపై పోలీసులు ఇప్పటివరకూ కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. ఆ గ్రామంలోని గోధుమ చేనులో ప్రేమజంట ఉండడాన్ని గమనించిన స్థానికులు వారి వద్దకు వెళ్లి, అక్కడ ఏం చేస్తున్నారని నిలదీశారు. వారు అక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ చితక్కొట్టారు. ఈ దాడిలో అమ్మాయికి స్పల్ప గాయలు కాగా, అబ్బాయికి తీవ్రగాయాలయ్యాయి.