: ఇక 'ఆధార్' కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు


ఇప్పుడు మనదేశంలో 'ఆధార్' కార్డు ప్రతి దానికీ ఆధారమే. బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా, ఏదైనా ప్రభుత్వ పథకంలో చేరాలన్నా... ప్రతి దానికీ అది కచ్చితంగా అవసరం. అయితే, గతంలో 'ఆధార్' కోసం నమోదు చేసుకున్న వారిలో చాలా మందికి ఇప్పటి వరకూ కార్డులు చేరలేదు. అవి డెలివరీ కాకుండా పోస్టాఫీసుల్లో కుప్పలు తెప్పలుగా పడి వున్నాయి.

ఈ నేపథ్యంలో వాటి కోసం ఎదురు చూడక్కర్లేకుండా ప్రభుత్వం ప్రజలకు ఓ సదుపాయాన్ని కల్పించింది. 'ఆధార్' అధికారిక వెబ్ సైటు ( http://uidai.gov.in) నుంచి ఇక ఎవరికి వారు వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న సమయంలో ఇచ్చిన రశీదులో పేర్కొన్న ఎన్ రోల్ మెంటు నెంబరును, నమోదు సమయాన్ని, ఇతరత్రా అడిగిన వివరాలనూ నమోదు చేసి 'ఆధార్' డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

  • Loading...

More Telugu News